“ఉస్తాద్ భగత్ సింగ్ ” ట్రైలర్ టీజ్ అదిరిపోయిందిగా..

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) మూవీ ఎట్టకేలకు ఉగాది కానుకగా ఈ నెల 19న  థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్‌కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ట్రైలర్ టీజ్(Trailer Tease) అంటూ 43 సెకన్ల వీడియో రిలీజ్ చేశారు. ” ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్ముంటే దాటొచ్చు.. అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ట్రైలర్ టీజ్‌లో పవన్ లుక్స్ సైతం అదిరిపోవడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>