కలం, మెదక్ బ్యూరో : కరాటే పోటీలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులను ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ , గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. ఇటీవల గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలలో సంగారెడ్డి (Sangareddy) , బీరంగూడకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ చిన్నారులను ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్ రెడ్డి వేర్వేరుగా అభినందించారు. విద్యార్థి స్థాయి నుండి క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

