ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుధాకర్ తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో జంతుశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్‌లో ఒక్కో పోస్టు, ఉర్దూ మీడియంలో జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, ఉర్దూలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఎస్‌ఈటీ, ఎన్ఈటీ, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>