కలం, వెబ్ డెస్క్ : సిడ్నీలోని ప్రముఖ స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపల్ కౌన్సిల్ 73వ మేయర్ (Strathfield Mayor)గా తెలుగు మూలాలున్న సంధ్యా రెడ్డి (Sandhya Reddy) ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు డిప్యూటీ మేయర్‌గా సేవలందించిన ఆమె, కౌన్సిలర్ల పూర్తి మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ పదవిలో ఆమె సెప్టెంబరు 2028 వరకు కొనసాగనున్నారు.
హైదరాబాద్‌లో న్యాయవిద్య పూర్తి చేసుకుని 1991లో ఆస్ట్రేలియాకు వలసవెళ్లిన సంధ్యా రెడ్డి, ఇమిగ్రేషన్ లాయర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా సామాజిక, రాజకీయ రంగాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2021, 2024 స్థానిక ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఆమె, 2023లో స్ట్రాత్‌ఫీల్డ్ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు.

