మరో 90 నిమిషాలలో స్పిరిట్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ : సందీప్ రెడ్డి వంగా

కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘స్పిరిట్'(Spirit). ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ క్యారెక్టర్‌ను ఎవ్వరూ చూపించనంత వైల్డ్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన యానిమాల్ బ్యూటీ తృప్తి డిమ్రీ (Tripti Dimri) హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన సందీప్ రెడ్డి వంగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. మరో 90 నిమిషాలలో స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ట్వీట్ చేశారు. దీనితో ఈసారి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also : లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>