Mobile Popup Ad
Mobile Popup Ad

బహు భార్యత్వం ఉండాల్సిందే.. ఎన్సీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ఖురాన్ ప్రకారం బహు భార్యత్వం (Polygamy) ఆచరించడం తప్పేం కాదని మహారాష్ట్రలోని ఎన్సీపీ ఎమ్మెల్యే సనా మాలిక్ అన్నారు. దేశంలో ముస్లింలు ఈ విధానం పాటించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సనా మాలిక్ చేసిన వ్యాఖ్యలు గగ్గోలు పుట్టించాయి. బహుభార్యత్వం కేవలం ముస్లింలోనే ఉందా.. ఇతర మతాల్లో లేదా.. అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. నిషేధించడమేంటన్నారు. అలాగే, ట్రిపుల్ తలాక్ రద్దును కూడా ఆమె తప్పుబట్టారు.

భారతదేశంలో ఖురాన్ ప్రకారం చట్టాలు చేయాలని కోరుతున్నామని.. పాకిస్థాన్‌లో ఏదీ అమల్లో ఉందో అలా చేయమనడం లేదు కదా.. అని వివరించారు. సనా మాలిక్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజ్యాంగం, చట్టాలు పాటించకపోతే పాకిస్థాన్ వెళ్లిపోవాలని ఎమ్మెల్యే నితీష్ రాణా ఘాటుగా వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>