Mobile Popup Ad
Mobile Popup Ad

అదిరిపోయే ఫీచర్లతో రోబోటాక్సీ కారు.. డ్రైవర్ లేకుండానే రయ్ రయ్!

కలం, వెబ్ డెస్క్: అమెజాన్ అనుబంధ సంస్థ అయిన జూక్స్ సరికొత్త రోబోటాక్సీ (Robotaxi)  డిజైన్‌ను ఆవిష్కరించింది. అమెరికాలో త్వరలోనే పెయిడ్ రైడ్ సేవలను ప్రారంభించేందుకు ఈ కొత్త మోడల్‌ను రూపొందించింది. టోస్టర్ ఆకారంలో ఉండే ఇది గంటకు గరిష్టంగా 75 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇరువైపులా ఒకేలా కనిపించే ఈ కారు ఏ దిశలోనైనా సులభంగా ముందుకుపోగలదు. ముందు, వెనుక భాగాలను గుర్తించడానికి వీలుగా రిఫ్లెక్టర్లను మార్చడంతో పాటు, డోర్ ఇంటర్‌ఫేస్‌కు స్పీకర్, మైక్రోఫోన్, టూ-వే ఆడియో సదుపాయాన్ని సంస్థ కొత్తగా అందిస్తోంది.

ఇక వాహనం (Robotaxi) లోపలి భాగం విషయానికొస్తే.. స్టీరింగ్ వీల్, పెడల్స్ లేని ఈ మినిమలిస్టిక్ క్యాబిన్‌లో నలుగురు ప్రయాణికులు కూర్చునేలా సీట్లను అమర్చారు. ప్రయాణికుల సౌకర్యం కోసం సౌకర్యవంతమైన సీట్లు, హెడ్‌రెస్ట్‌లు, మెరుగైన టచ్‌స్క్రీన్, ఛార్జింగ్ ప్యాడ్స్ లాంటివి ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తమ వస్తువులను మరిచిపోతే సులభంగా గుర్తించేందుకు వీలుగా క్యాబిన్‌కు తేలికపాటి రంగులను ఉపయోగించారు. ప్రస్తుతం లాస్ వెగాస్, శాన్ ఫ్రాన్సిస్కో, మయామి, ఆస్టిన్ వంటి నగరాల్లో ఉచిత సేవలు అందిస్తున్న జూక్స్ (Zoox) .. ఇటీవల లాస్ వెగాస్‌లో ఉబెర్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని, త్వరలోనే పెయిడ్ రైడ్ సేవలను విస్తృతం చేయాలని భావిస్తోంది.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>