త‌మిళ్‌లో సెల‌బ్రిటీ మాస్ట‌ర్ చెఫ్‌.. హోస్ట్‌గా స‌మంత‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: వర‌ల్డ్ ఫేమ‌స్ వంట‌ల పోటీ సెల‌బ్రిటీ మాస్ట‌ర్ చెఫ్ (Celebrity MasterChef) ఇప్పుడు త‌మిళ‌నాడులో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ షోకు స్టార్ హీరోయిన్‌ స‌మంత (Samantha) హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంద‌ని సోనీ పిక్చ‌ర్స్ నెట్‌వ‌ర్క్స్ ఇండియా తాజాగా ప్ర‌క‌టించింది. సాధార‌ణంగానే ఈ షోకు భారీ క్రేజ్ ఉంటుంది. ఇక స‌మంత హోస్ట్‌గా ఉండ‌నుంద‌నే ప్ర‌క‌ట‌న‌తో దీనికి మ‌రింత హైప్ క్రియేట్ అయ్యింది. సోనీ విళా, సోనీ లివ్ వేదికగా ప్రసారమయ్యే ఈ షోతో ఫుడ్, సెలబ్రిటీలు, కాంపిటేష‌న్‌తో ఒకే వేదికపై ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నున్నారు.

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు తొలిసారి ఈ షోలో కెమెరా ముందు కిచెన్‌లోకి ఎంట్రీ ఇచ్చి కఠినమైన ఫుడ్ ఛాలెంజెస్ ఎదుర్కోనున్నారు. వంట గదిలో ఒత్తిడి, ఊహించని ట్విస్టులు, సరదా క్షణాల మధ్య ఈ సెలబ్రిటీలు తమ కుకింగ్ టాలెంట్‌ను నిరూపించుకోబోతున్నారు. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా లోకల్ ఫ్లేవర్స్‌, ప్రత్యేకమైన కల్చర్‌కు ప్రాధాన్యమిస్తూ బనిజె ఏషియా సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ కుకింగ్ రియాలిటీ షో మెయిన్ ఎపిసోడ్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ ప్రత్యేకమైన షార్ట్ ఫార్మ్ కంటెంట్ ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఇది త్వరలోనే సోనీ విళా, సోనీ లివ్‌లో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన ఖ‌చ్చిత‌మైన తేదీల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

ఇక ఈ షో గురించి స‌మంత మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు చేసిన వాటిలో ఇది చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్ అని, అందుకే దీన్ని చేయడానికి వెంటనే ఒప్పుకున్నానని చెప్పారు. ఎంతో మంది సెల‌బ్రెటీల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూ, మధురమైన జ్ఞాపకాలను సృష్టించ‌బోతున్నామ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. సాధారణంగా సెల‌బ్రిటీల్లో కెమెరాల ముందు కనిపించని మ‌రో కోణాన్ని బయటపెట్టడంలో ఫుడ్‌కు సెప‌రేట్ ప‌వ‌ర్ ఉంద‌న్నారు. సెలబ్రిటీలు కిచెన్‌లోకి అడుగుపెట్టి, రిస్క్‌లు తీసుకోవడం, తప్పులు చేయడం, తమను తామే సర్‌ప్రైజ్ చేసుకోవడం, ప్యాషన్‌తో పోటీప‌డ‌టాన్ని చూడ‌టానికి తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు. స‌మంత ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ కావ‌డంతో సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మ‌రి ఈ షోతో ప్రేక్ష‌కుల ముందుకు ఎలా వ‌స్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>