భారీ క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్తున్న స‌మంత‌ మూవీ!

క‌లం, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో న‌టించిన సినిమా మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). ఇటీవ‌ల జూన్ 19న విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో, పైసా వ‌సూల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్తోంది. డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి డైరెక్ట‌న్‌లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్​ను ఆకట్టుకోవడంలో సక్సెస్​ అయ్యింది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్​ కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. ఇక సినిమా రిజల్ట్​పై సమంత సంతోషం వ్యక్తం చేసింది. సినిమా మొదటి రోజు నుంచే మంచి స్పందన వచ్చిందని, ప్రేక్షకులు తమపై చూపించిన ప్రేమ, ఆదరణకు చాలా విలువైందని సమంత పేర్కొంది. ఇక ఏ స్టార్​ హీరో లేకపోయినా సినిమా కంటెంట్​ను బట్టి ఆడియెన్స్​ ఆదరించారని సమంత ఎక్స్​ వేదికగా చేసిన పోస్టులో తెలిపింది. మహిళా ప్రేక్షకులు తమ సినిమాను ఎక్కువగా ఆదరిస్తున్నారని, తన చిన్న నిర్మాణ సంస్థ మరోసారి తన సత్తా చాటిందని సమంత వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>