epaper
Wednesday, February 18, 2026
epaper

ఘోర పరాజయంపై పాకిస్థాన్ కెప్టెన్ స్పందన ఇదే..

కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భారత్ చేతిలో పాకిస్థాన్ మరోసారి ఓటమిని రుచిచూసింది. కొలంబోలోని ఆర్‌పీఎస్ స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమిపై స్పందించిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలి అఘా (Salman Ali Agha)  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవర్ ప్లేలోనే మ్యాచ్‌ తమ చేజారిపోయిందని, అప్పుడే తాము ఓడిపోయామని అన్నాడు.

మ్యాచ్ అనంతరం తమ ఓటమికి కారణాలు వెల్లడించాడు. పవర్‌ప్లేలో మూడు నాలుగు వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ను చేజార్చిందని అంగీకరించాడు. నలుగురు స్పిన్నర్లను ఉపయోగించినా సరైన ఎగ్జిక్యూషన్ జరగలేదని చెప్పాడు. బ్యాటింగ్‌లో కూడా సరైన ఆరంభం దక్కలేదని స్పష్టం చేశాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ కొంచెం టాకీగా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినా పరిస్థితులకు తగ్గట్టు ఆడలేకపోయామని వివరించాడు. ఇలాంటి మ్యాచ్‌ల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని కంట్రోల్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

ప్రస్తుతం నమీబియాతో జరగనున్న మ్యాచ్‌పై తాము ఫోకస్ పెట్టామని, అది గెలిచి అర్హత సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తామని అఘా (Salman Ali Agha) తెలిపాడు. మొత్తానికి… భారత్ ముందు పాక్ మరోసారి నిలబడలేకపోయింది. ఇప్పుడు పాకిస్థాన్ తదుపరి మ్యాచ్‌లో ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తిగా మారింది.

Read Also: హాజెల్‌వుడ్ ఔట్.. స్మిత్ ఆస్ట్రేలియా జట్టులోకి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>