Mobile Popup Ad
Mobile Popup Ad

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో బిగ్ ట్విస్ట్

కలం, వెబ్ డెస్క్ : ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన సాయికృష్ణ లాకప్ డెత్ (Saikrishna Lockup Death) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సూర్యారావు పేటలోని ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. నేడు ఉదయం క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన వేళ ఈ కేసులోని మరో ఇద్దరు నిందితులు లొంగిపోవడం గమనార్హం.

కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ (Saikrishna Lockup Death) తరువాత మృతదేహాన్ని మాయం చేయడంలో అశోక్, నాని కీలకంగా వ్యవహరించారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడా ఉన్న సీఐ నాగరాజు అరెస్ట్ తర్వాత వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా వారు లొంగిపోవడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో సాయికృష్ణ చనిపోయిన రోజున ఏం జరిగింది? అతని మృతదేహం ఏం చేశారు? అనే విషయాలపై అశోక్, నానిలను విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Read Also: ప్రభుత్వ సేవలు మరింత సులువు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>