కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పరిపాలనలో పారదర్శకత , వేగాన్ని పెంచేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu ) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అమరావతి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నన్స్ సొసైటీ ( RTGS) కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, ప్రక్రియలను సులభతరం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇందులో భాగంగా ప్రజలు తమ సమస్యలను సులభంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ఆన్ లైన్ పోర్టల్ తో పాటు ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా ప్రత్యేక సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. ‘మనమిత్ర’ వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్‌లే కాకుండా, వాయిస్ మెసేజ్‌ల రూపంలో పంపే ఫిర్యాదులను కూడా స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

