అదరగొట్టిన జాన్సేన్.. న్యూజిలాండ్ టార్గెట్ 170

కలం, స్పోర్ట్స్:  టీ20 వరల్డ్ కప్ సెమీస్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. న్యూజిలాండ్‌తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో సఫారీల బ్యాటింగ్ లైనప్ వరుసగా కుప్పకూలింది. ఆ సమయంలో స్టబ్స్, జాన్సేన్ కలిసి మ్యాచ్‌ను (SA vs NZ Semi Final) నిలబెట్టారు. ఆ తర్వాత స్టబ్స్ ఔట్ అయినా జాన్సేన్ చెలరేగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. సెమీఫైనల్ మ్యాచులో సౌతాఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాటర్ మార్కో జాన్సేన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒక దశలో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును జాన్సేన్ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా కివీస్ బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కడితే, జాన్సేన్ మాత్రం న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. మార్కో జాన్సేన్ కేవలం 30 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ట్రిస్టన్ స్టబ్స్ మరో ఎండ్‌లో జాన్సేన్‌కు సహకరిస్తూ 24 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మిగిలిన వారు మార్క్రామ్ (18), బ్రెవిస్ (34) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ప్రారంభంలో వికెట్ల వేట కొనసాగించిన న్యూజిలాండ్ బౌలర్లు చివరి ఓవర్లలో జాన్సేన్ జోరును అడ్డుకోలేకపోయారు. మ్యాట్ హెన్రీ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర 29 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కోల్ మెక్కోంచీ 9 పరుగులకే 2 కీలక వికెట్లు తీసి ప్రోటీస్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యం ఛేదనకు న్యూజిలాండ్ సన్నద్ధం అవుతోంది. జాన్సేన్ ఇచ్చిన ఊపుతో దక్షిణాఫ్రికా బౌలర్లు కివీస్‌ను కట్టడి చేస్తారో లేదో చూడాలి.

Read Also: అంగరంగ వైభవంగా ‘విరోష్’ రిసెప్షన్.. హాజరైన సినీ ప్రముఖులు

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>