అంగరంగ వైభవంగా ‘విరోష్’ రిసెప్షన్.. హాజరైన సినీ ప్రముఖులు

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల (Vijay-Rashmika) రిసెప్షన్ (Reception) హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వెడ్డింగ్ జరిగింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ తాజ్ కృష్ణాలో రిసెప్షన్ ఏర్పాటుచేశారు. కేవలం ఆహ్వానితులకు మాత్రమే పరిమితమైన ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.

అలాగే తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ సతీమణి గీతారెడ్డి, అక్కినేని ఫ్యామిలీ, ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి దయాకర్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు, డీకే అరుణ, ఇతర ప్రముఖులు హాజరై సందడి చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్ (Vijay-Rashmika) వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా తాజ్ కృష్ణా పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Read Also: ఆ హీరో ఎక్కడ.. ప్రమోషన్స్ లేవు.. పార్టీలు లేవు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>