Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రేమ పెళ్లి.. ఏడాదికే భార్య‌ను హత్య చేసిన భ‌ర్త

కలం, వెబ్ డెస్క్: కనిపెంచిన తల్లిదండ్రులను కాదని.. ప్రేమించిన ప్రియుడే ముఖ్యమని, అతడిని పెళ్ళించేసుకున్న యువతికి చావే దిక్కయింది. జీవితాంతం చేదోడువాదోడుగా నిలుస్తూ అండగా ఉండాల్సిన ప్రియుడే కాలయముడయ్యాడు. ప్రేమిచినోడే తన భార్యను క‌డ‌తేర్చిన (Husband Kills Wife) ఘటన మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా (Mahabubnagar)లో వెలుగు చూసింది. చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా కనిపెంచిన తల్లిదండ్రులను కాదనుకుని యువతి శ్రీదేవి.. తన ప్రియుడితోనే జీవితం అనుభవించాలనుకుంది. పెద్ద‌ల‌ను ఎదిరించి మ‌రీ పెళ్లిచేసుకుని కుటుంబానికి దూరమైంది. తన కుటుంబం, తన సర్వస్వం భర్తే అనుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.  కొద్దిరోజులు సరదాగే గడిచినా.. నెమ్మదిగా గొడవలు జరగసాగాయి. ఈ క్రమంలోనే పచ్చని కాపురంలో చిచ్చురేగింది.

ప్రేమించిన తన భార్యపై ఎందుకు అంతగా కోపం పెంచుకున్నాడో తెలియదు గాని, భార్యను కడతేడ్చాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఎవరూ చూడకముందు తన భార్య శ్రీదేవిని భర్త చందు దారుణంగా హత్య చేశాడు. మృత‌దేహాన్ని సంచిలో చుట్టి పొలానికి తీసుకెళ్ళి మృతదేహాన్ని మాయం చేశాడు. ఆ త‌ర్వాత ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని డ్రామాలు ఆడాడు. ఒక సంవత్సర కాలంలోనే ప్రేమించిన భార్యను చంపేయడంతో (Husband Kills Wife) స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెళ్లి త‌ర్వాత శ్రీదేవికి భ‌ర్త చందు న‌ర‌కం చూపించాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రేమ పెళ్లి కావ‌డంతో పేరెంట్స్ కూడా తన పరిస్థితిని చెప్పుకోకుండా కుమిలిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు ప‌రారీలో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ఏపీలో రాగల 3 గంటల్లో భారీ వర్షం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>