ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

కలం, వెబ్ డెస్క్ : బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయం (Ashok Dham Temple) వద్ద సోమవారం తొక్కిసలాట జరిగింది. విద్యుత్ తీగ తెగిపోవడంతో భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా, 12 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులు లఖిసరాయ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా తగిన ఏర్పాటు చేసినా ఊహించని రీతిలో భక్తులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. జనసమూహం భారీగా ఉండడంతో ఒత్తిడి బారికేడింగ్ లోని ఒక భాగం కూలిపోవడంతో ఒకరిపై ఒకరు పడడంతో ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>