Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ సమ్మె.. సూర్యాపేట బస్టాండ్‌లో హైటెన్షన్

కలం, సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకున్నది. సూర్యాపేట (Suryapet)  జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ ఆందోళన చేపట్టారు. సూర్యాపేట డిపో నుంచి పోలీసుల రక్షణతో బస్సులను బయటకు పంపే ప్రయత్నం చేయగా, కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు బస్సులకు అడ్డంగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఒక్క బస్సు కూడా కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళన చేస్తున్న పలువురు ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.

Read Also:  నా పేరుతో వేరే వాళ్లు ఓటు వేశారు : నటి అక్షయ హరిహరన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>