కలం, వెబ్ డెస్క్ : నటి అక్షయ హరిహరన్ (Akshaya Hariharan) ఓటు విషయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన ఓటు వేరే వ్యక్తి వేసినట్లు తెలిసి ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. అడయార్‌లోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వెళ్లిన ఆమెకు, తన పేరుతో ఇప్పటికే ఓటు నమోదు అయ్యిందని పోలింగ్ సిబ్బంది తెలిపినట్లు సమాచారం. దీంతో ఆమె తన గుర్తింపు పత్రాలను చూపించినప్పటికీ సాధారణ ఓటు వేయలేని పరిస్థితి ఎదురైంది.
దీంతో దాదాపు గంటసేపు నిరీక్షించిన తర్వాత ఆమె టెండర్డ్ ఓటు (Tendered Vote) వేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పొరపాట్లు మరెంతమందికి జరిగాయో అని అనుమానం వ్యక్తం చేశారు. తన పేరుతో వేసిన ఓటును రద్దు చేయాలని, అలాగే దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె (Akshaya Hariharan) డిమాండ్ చేశారు. ఈ ఘటన ఓటర్ వెరిఫికేషన్ వ్యవస్థపై చర్చకు దారితీసింది.
Read Also: నేపాల్ లో మళ్లీ నిరసనలు.. ఇద్దరు మంత్రులు రాజీనామా!
Follow Us On: Instagram

