కలం, వెబ్‌డెస్క్: ఆర్టీసీ జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ (Ministers Quarters) లో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంతో చర్చలు జరిపి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, హనుమంతు ముదిరాజ్, ఇతర సంఘాల నేతలు మంత్రి పొన్నంను సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
చిరకాల స్వప్నమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులకు గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ, ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించడం వంటి అంశాలపై జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మంత్రి పొన్నం స్పందిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ప్రజా రవాణాను మరింత బలపరిచే విధంగా కార్మికులు నూతన ఉత్సాహంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

