ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి విషమం

కలం, వరంగల్ బ్యూరో: నర్సంపేట డిపోలో ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ (Narsampet RTC Driver) శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎం వైద్యులు తెలిపారు. దీంతో అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా గురువారం మధ్యాహ్నం నర్సంపేట డిపోలో డ్రైవర్ శంకర్‌గౌడ్‌ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలు కావడంతో తోటి కార్మికులు, స్థానికులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతున్న శంకర్ గౌడ్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు.

Read Also: జబ్బుల గుప్పిట్లో భారత్.. సగం మందికి అనారోగ్య సమస్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>