కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ (Sangareddy New Collector) గా ప్రతీక్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తానని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ మాధురి, కలెక్టరేట్ సిబ్బంది నూతన కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిన్న జరిగిన సాధారణ బదిలీల్లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్న ప్రావీణ్య ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రెటరీగా నియమించబడ్డారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ గా పని చేసిన ప్రతీక్ జైన్ బదిలీపై సంగారెడ్డి జిల్లాకు వచ్చారు.
Read Also: కవిత వ్యాఖ్యలకు కేసీఆర్ రియాక్షన్‌పై ఉత్కంఠ

