Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డిలో రూ. 2 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం

కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు రూ.2 కోట్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. రేపటి నుంచే సీసీ రోడ్ల (Roads) నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తైన తర్వాత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. మట్టి రోడ్ల కారణంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>