కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సారథి రియాన్ పరాగ్ (Riyan Parag) మైదానంలో అనూహ్య రీతిలో కెమెరా కంటికి చిక్కారు. జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన ఇ-సిగరెట్ తాగుతూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా స్టేడియం ప్రాంగణం లేదా డ్రెస్సింగ్ రూమ్ పరిధిలో ధూమపానం చేయడం నిబంధనలకు విరుద్ధం.
భారత్ లో 2019 నుంచే ఇ-సిగరెట్ల విక్రయం తోపాటు వాటి వాడకంపై కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువైతే పరాగ్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారీ జరిమానాతో పాటు మ్యాచ్ సస్పెన్షన్ లేదా కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

