నేడే టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ ప్రమాణం

కలం, వెబ్ డెస్క్ : నేడు (ఏప్రిల్ 29)  తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ (Nara Lokesh) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ భవన్‌లో  ఘనంగా నిర్వహించేందుకు పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన, 2029 ఎన్నికల లక్ష్యాలు, అలాగే ప్రభుత్వ పథకాలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

కొత్తగా ఎన్నికైన 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో ఇదే తొలి భేటీ కావడం విశేషం. ఈ సమావేశం ద్వారా పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగతంగా బలపరిచే చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేశ్ (Nara Lokesh)  బాధ్యతలు స్వీకరించడం ద్వారా టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశముందని భావిస్తున్నారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని బలోపేతం చేయడంలో ఇది కీలక అడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>