అండర్‌ బ్రిడ్జి సమస్యపై గులాబీ పూలతో నిరసన

కలం, వరంగల్: శివనగర్‌ 35వ డివిజన్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద మంచినీటి పైప్‌లైన్‌ లీకేజీ, డ్రైనేజీ నీరు, బురద, దుర్వాసన సమస్యలను (Underbridge Problems) పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాంటెస్టెడ్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి మేరుగు అశోక్‌ ఆధ్వర్యంలో గురువారం గులాబీ పూలు చల్లి వినూత్న నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ.. దేశాయిపేట ఫిల్టర్‌ బెడ్‌ నుంచి వచ్చే తాగునీటి పైప్‌లైన్‌ పగిలి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

లీకేజీ నీటితో పాటు డ్రైనేజీ, చేపలు కడిగే నీరు అండర్‌ బ్రిడ్జి కింద చేరడంతో బురద, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లీకేజీ కారణంగా కలుషిత నీటి సమస్య కూడా ఏర్పడుతోందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టి, అండర్‌ బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>