రోహిత్ వయసు వివాదం.. భారత జట్టులోకి కొత్త ప్లేయర్లు!

కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా అండర్-19తో సిరీస్‌కు ముందే భారత జూనియర్ జట్టులో (India U19 Squad) బీసీసీఐ కీలక మార్పులు చేసింది. రెండు ఫార్మాట్ల జట్లలోనూ కొత్త ఆటగాళ్లను చేర్చింది. సౌరాష్ట్రకు చెందిన ఆర్యన్ సవ్సానీని వన్డే జట్టులోకి తీసుకుంది. హర్యానా ఆటగాడు తన్మయ్ బలోడాకు మల్టీ డే జట్టులో చోటిచ్చింది. ఈ మార్పులను బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ తాజా నిర్ణయంతో వన్డే, మల్టీ డే జట్ల కూర్పు మారిపోయింది. ఆర్యన్ సవ్సానీ వన్డే జట్టులోకి రాగా.. తన్మయ్ బలోడా మల్టీ డే జట్టులోకి వచ్చాడు. రోహిత్ యాదవ్ స్థానాలను వీరిద్దరూ భర్తీ చేయనున్నారు.

రోహిత్ స్థానంలో సవ్సానీ

వన్డే జట్టులో రోహిత్ యాదవ్ స్థానాన్ని సౌరాష్ట్ర ఆటగాడు ఆర్యన్ సవ్సానీ భర్తీ చేశాడు. దీంతో లక్శ్య రైచందానీ కెప్టెన్సీలోని భారత U19 వన్డే జట్టులో తాజాగా ఒక మార్పు చోటు చేసుకుంది. మరోవైపు మల్టీ డే జట్టులో రోహిత్ స్థానాన్ని హర్యానాకు చెందిన తన్మయ్ బలోడా తీసుకున్నాడు. యశ్‌వర్ధన్ చౌహాన్ నాయకత్వంలోని జట్టులో బలోడాకు అవకాశం దక్కింది. రోహిత్ ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత U19 జట్టుకు ఆడాడు. లెగ్ స్పిన్నర్‌గా యువ టెస్టులో ఆరు వికెట్లు కూడా తీశాడు.

అయినప్పటికీ వయసు వివరాల వ్యవహారంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. అతడిపై రెండేళ్ల నిషేధం విధించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. భారత్ U19, ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనుంది. వన్డేలు సెప్టెంబర్ 18, 21, 23 తేదీల్లో రాజ్‌కోట్‌లో జరుగుతాయి. మల్టీ డే మ్యాచ్‌లు సెప్టెంబర్ 27-30 మధ్య రాజ్‌కోట్‌లో, అక్టోబర్ 5-8 మధ్య అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. బీసీసీఐ తాజా మార్పులతో ఇప్పుడు భారత U19 జట్టు కొత్త కూర్పుతో ఆస్ట్రేలియా సిరీస్‌కు సిద్ధమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>