విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు.. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

కలం, కరీంనగర్: కరీంనగర్ పట్టణం కమాన్ సమీపంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఈనెల 15 నుండి 17 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మంగళవారం రోజున ఆలయ కమిటీ సభ్యులు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి టెంపుల్ ఆలయ కమిటీ సభ్యులు, విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా, ఘనంగా బ్రహ్మోత్సవాల ను నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలు సెప్టెంబర్ 17 వరకు వివిధ విశేష పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండుగ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. విశ్వబ్రాహ్మణ బంధువులందరూ ఈ దివ్య మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>