గవర్నర్ చేతుల మీదుగా రంగు మౌనికకు డాక్టరేట్

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని గంగిపల్లి గ్రామానికి చెందిన పూసాల శరత్ సతీమణి రంగు మౌనిక (Rangu Mounika) న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో భాగంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆమె ఈ డాక్టరేట్ అందుకున్నారు. 2015లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన మౌనిక, 2016లో నల్సార్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాల సీనియర్ ప్రొఫెసర్ జి.బి. రెడ్డి పర్యవేక్షణలో “బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇన్ హైదరాబాద్ సిటీ: ఎ లీగల్ స్టడీ” అనే అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనా పత్రానికి విశ్వవిద్యాలయం పీహెచ్‌డీని ప్రదానం చేసింది. న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ సాధించడం పట్ల రంగు మౌనికను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలతో పాటు గంగిపల్లి సర్పంచ్ వాల ప్రదీప్ రావు, మాజీ ఎంపీటీసీ రంగు భాస్కరాచారి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>