కలం, వెబ్‌డెస్క్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Global Summit-2025) ప్రారంభం అయింది. ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సును సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. అతిథులు ఒక్కోక్కరుగా సదస్సుకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సమ్మిట్ లో ఓ రోబో ప్రధాన ఆకర్షణంగా నిలిచింది. సదస్సుకు వచ్చిన ప్రతినిధులు, అతిథులకు ఎంట్రేన్స్ లో నిలబడి ఉన్న రోబో (Robot) స్వాగతం పలుకుతోంది. చేతులు ఊపుతూ హాయ్ చెబుతోంది.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు (Telangana Global Summit-2025) 6 ఖండాల నుంచి అతిథులు వస్తున్నారు. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ‘అతిథి దేవో భవ’ అనే భారతీయ సాంప్రదాయానికి తగ్గట్లుగా వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే, తెలంగాణ ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసింది.
Read Also: ఒకే వేదికపై నాగార్జున, కొండా సురేఖ..!
Follow Us On : X(Twitter)


