కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌కు వెళ్తున్న బాలికను నమ్మించి, అపహరించి అఘాయిత్యానికి పాల్పడటం కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సనత్ నగర్ (Sanath Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఉదయం పాఠశాలకు వెళ్తున్న బాలికను షాబాజ్ అనే వ్యక్తి వెంబడించాడు. ఎవరూ లేని ప్రదేశానికి రాగానే.. సదరు బాలికను మాటల్లో పెట్టి, నమ్మించి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకున్నాడు.
పార్కుకి తీసుకెళ్లి..
అనంతరం, సనత్ నగర్‌లోని ఓ పార్కుకి తీసుకెళ్లిన దుండగుడు.. అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. వెంటనే చిన్నారి, ఇంటికి చేరుకుని తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు.. సీసీ కెమెరాల సాయంతో షాబాజ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.
పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు సనత్ నగర్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది.

