కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు పాల్గొంటారు. రాబోయే మార్చి నెల నుండి జూన్ వరకు అమలు చేయాల్సిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనుంది. ఈ లక్ష్యాల కోసం అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేశారు.
పరిపాలనను మరింత వేగవంతం చేయడం, ప్రజలకు సంక్షేమ ఫలాలను త్వరితగతిన చేరవేయడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక సాగనుంది. విభాగాల వారీగా అధికారులు రూపొందించిన నివేదికలను పరిశీలించిన అనంతరం, ముఖ్యమంత్రి వాటికి తుది ఆమోదం తెలపనున్నారు.

