కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త అందించింది. వనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం సేవలను (AP Sadarem) మరింత సులభం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా సదరం సేవలకు సంబంధించి సదరం సర్టిఫికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) వివరాలను వెల్లడించింది.
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 9552300009 నంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే సేవలు లభిస్తాయి. ఇందులో సదరం స్లాట్ బుకింగ్, స్లాట్ ఖాళీ వివరాలతో పాటు సదరం సర్టిఫికేట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆర్టీజీఎస్ వివరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సదరం సేవలు మరింత చేరువ కానుండడంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

