వైరాలో భారీగా గంజాయి స్వాధీనం!

కలం, ఖమ్మం బ్యూరో : మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఖమ్మం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా వైరా (Wyra) పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న సుమారు రూ. 64 లక్షల విలువైన 128 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసినట్లు వైరా ఏసీపీ సారంగపాణి మీడియా సమావేశంలో వెల్లడించారు. ​

శుక్రవారం వైరా ఎస్‌ఐ రామారావు తన సిబ్బందితో కలిసి వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా, ఈ ముఠా పట్టుబడింది. రోడ్డు పక్కన ఐదు గోనె సంచులతో అనుమానాస్పదంగా నిలబడి ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు గమనించి, వారిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా, ఆ సంచుల లోపల 60 ప్యాకెట్లలో గంజాయి బయటపడిందని ఏసీపీ తెలిపారు. ​అరెస్ట్ అయిన వారిని ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మనుయాల్ బోత్రా (22), ​చిటికల సన్యాసినాయుడు (25), ​లక్ష్మణ్ (24)లుగా గుర్తించామన్నారు. ​వీరు ఒడిశాలోని మల్కనగిరి ప్రాంతం నుండి గంజాయిని సేకరించి, తమిళనాడుకు తరలించేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందని ఏసీపీ వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>