కలం, వెబ్ డెస్క్ : ఇరాన్‌లోని (Iran) యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయులకు టెహ్రాన్‌లోని (Tehran) ఇండియన్ ఎంబసీ (Indian Embassy) కీలక సూచన చేసింది. తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పరిస్థితులు ఉద్రిక్తంగా, ఆందోళకనంగానే ఉన్నట్లు భావించిన భారత ప్రభుత్వం అక్కడి ఇండియన్ ఎంబసీ ద్వారా స్పష్టమైన సూచనలు ఇచ్చింది. తక్షణం ఇరాన్‌ను విడిచిపెట్టాలని స్పష్టం చేసింది. అక్కడి ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల్లో మాత్రం ఇరాన్ ను ఖాళీ చేయాలని క్లారిటీ ఇచ్చింది. ఎంబసీకి తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా ఇతర మార్గాల్లో ఆ దేశం నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నాలు చేయవద్దని పేర్కొన్నది. కేవలం ఎంబసీ సూచించిన రూట్‌లలో మాత్రమే ఇరాన్ నుంచి బయటపడాలని నొక్కిచెప్పింది.
ఎప్పటికప్పుడు ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ (Indian Embassy) పరిస్థితులను గమనిస్తూ ఉన్నదని, అక్కడి ఇండియన్స్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉన్నదని, అందువల్లనే వెంటనే ఆ దేశాన్ని విడిచి వెళ్ళడానికి తగిన సూచనలు చేస్తూ క్షేమంగా ఉండే రూట్‌లను ఎంపిక చేసిందని వివరించింది. ఏ ఇబ్బంది ఎదురైనా వెంటనే ఎంబసీ అధికారులను సంప్రదించాలని ఇరాన్‌లోని ఇండియన్స్ కు సూచించింది.
Read Also: అకీరా బర్త్‌డే… పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్!
Follow Us On: X(Twitter)

