22 నుంచి రైతుభరోసా నిధులు పంపిణీ: ఆది శ్రీనివాస్

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర రైతులకు ఈ నెల 22 నుంచి రైతుభరోసా (Rythu Bharosa) నిధులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ (Adi Srinivas) ప్రకటించారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా రైతులకు రైతుభరోసా నిధులు అందుతున్నాయన్నారు.బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు వరి వేస్తే ఉరి అన్నారని గుర్తు చేశారు. సన్న బియ్యం పండించే రైతులకు రూ.500 బోనస్‌ అందిస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌.. రైతుభరోసా ఇచ్చి ఇదే జిందా తిలిస్మాత్‌ అనుకోమన్నారని దుయ్యబట్టారు. రైతులకు రైతుభరోసా, సన్న బియ్యానికి బోనస్‌, పనిముట్లు అందిస్తున్నామని చెప్పారు. రైతులు, ప్రజల మద్దతుతో మున్సిపల్‌, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే మిమ్మల్ని విశ్వసించరని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా 71.86 లక్షల టన్నుల ధాన్యం పండించామని ఆది శ్రీనివాస్ (Adi Srinivas) చెప్పారు. పండించిన ధాన్యంలో 39.08 లక్షల టన్నుల సన్న బియ్యం ఉందని వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు (Yellampalli Project) నీటితో పెద్దఎత్తున ధాన్యం పండించామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మోటార్లకు కూడా బిల్లులు పెండింగ్‌ పెట్టారని ఆగ్రహించారు. బీఆర్ఎస్‌ హయాంలో కట్టిన ఒకే ఒక్క కాళేశ్వరం కూలిపోయిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు నేటికీ సేవలందిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని ఫైర్ అయ్యారు.

Read Also: చికెన్​ ప్రియులు జాగ్రత్త.. అక్కడంతా కుళ్లిన మాంసమే!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>