ఎంబాపే వ్యాఖ్యల వివాదం.. చైనాకు మాడ్రిడ్‌ క్షమాపణలు

క‌లం, స్పోర్ట్స్‌: ఫుట్‌బాల్‌ స్టార్‌ కిలియన్‌ ఎంబాపే వ్యాఖ్యలపై రియల్‌ మాడ్రిడ్‌ (Real Madrid) క్లబ్‌ క్షమాపణలు చెప్పింది. చైనా మాజీ నేత మావో జెడాంగ్‌ను నియంతగా ప్రస్తావిస్తూ ఎంబాపే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో తొలుత ఎంబాపే క్షమాపణలు చెప్పగా.. తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రియల్‌ మాడ్రిడ్‌ కూడా చైనా ప్రజలకు క్షమాపణలు తెలిపింది. ఫ్రెంచ్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఎంబాపే.. తన ముఖాన్ని చైనా నియంత చిత్రానికి జోడించిన మీమ్‌ గురించి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు చైనాలో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి.

దీంతో అక్టోబర్‌ 27న ఎంబాపే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల వల్ల చైనా ప్రజలు బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అయితే, వివాదం అక్కడితో ఆగలేదు. మెన్గ్నియు, షాంఘై మిల్క్‌గ్రౌండ్‌, ఈస్ట్‌రాక్‌ బెవరేజ్‌ వంటి చైనా సంస్థలు ఎంబాపేతో తమ వ్యాపార సంబంధాలను నిలిపివేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అక్టోబర్‌ 28న రియల్‌ మాడ్రిడ్‌ స్పందించింది. తమ ఆటగాడి వ్యాఖ్యల వల్ల చైనా ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నట్లు క్లబ్‌ ప్రకటించింది.

చైనా చరిత్ర, సంస్కృతి, ప్రజల పట్ల తమకు గౌరవం ఉందని స్పష్టం చేసింది. చైనాలోని తమ అభిమానుల పట్ల కూడా గౌరవాభిమానాలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, ఎంబాపే క్షమాపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్‌ తెలిపారు. దీంతో ఎంబాపే వ్యక్తిగత క్షమాపణలతో మొదలైన వ్యవహారం.. రియల్‌ మాడ్రిడ్‌ అధికారిక క్షమాపణల వరకు వెళ్లింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>