నష్టపోయిన ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తాం : చంద్రబాబు

కలం, వెబ్​ డెస్క్​ : అర్నబ్​ తుఫానులో ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రకటించారు. అర్నబ్​ తుఫానుపై తీసుకున్న చర్యలపై సీఎం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. మూడు రోజులుగా తుఫాను ప్రభావంపై 8 సార్లు సమీక్షలు నిర్వహిస్తూ, తీవ్రతను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఆర్టీజీఎస్​ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ప్రాణనష్టాన్ని పూర్తిగా నివారించడం ప్రధాన లక్ష్యంగా పనిచేసినట్లు తెలిపారు. తుఫాన్​ బీభత్సంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

పంట, ఆస్తి, ఆర్థికంగా నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు (CM Chandrababu). సహాయ చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడంలో విజయం సాధించిన ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. దివిసీమ, హరికేన్​, హుదుహుద్​, తితిలీ లాంటి తుఫానులను ఎదుర్కొనట్లు గుర్తు చేశారు. అప్పుడు టెక్నాలజీ లేకపోవడం వల్ల చాలా మంది మరిణించారని అర్నబ్​ తుఫాన్​ కారణంగా కేవంల ఐదుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు చంద్రబాబు తెలిపారు.

నష్టపోయిన పంటలకు పరిహారం

అర్నబ్ తుఫాను కారణంగా నష్టపోయిన పంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం. వరి పంటకు ఎకరాకు రూ.20 వేలు చెరుకు పంటకు ఎకరాకు రూ.25 వేలు సాయం అందించనుంది. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడుకు వంటి పంటలకు ఎకరాకు రూ.15 వేల నష్టపరిహారం. అరటి, పసుపు, మామిడి, జీడిమామిడితో పంటలతో పాటు కాఫీ, డ్రాగన్ ఫ్రూట్‌ పంటకు ఎకరాకు రూ.35 వేల సాయం ప్రకటించింది.
కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్‌కు రూ.25 వేలు నష్టపరిహారం. తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం ప్రకటించిన సర్కార్.. కొబ్బరి, ఆయిల్ పామ్‌ ఒక్కో చెట్టుకు రూ.15 వేలు సాయం చేయనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>