కలం, డెస్క్ : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సన్నద్ధం అవుతుంది. ఈ సిరీస్ కటక్ వేదికగా మంగళవారం ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో తొలి టీ20 ఆడాలంటే టీమిండియా ఐదుగురు ప్లేయర్లను బరిలోకి దించాల్సిందేనని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అన్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌తో సరైన జట్టు కూర్పు ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. శుభ్‌మన్ గిల్ రీఎంట్రీతో వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మూడో స్థానంలో అవకాశం తగ్గిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
మిడిల్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా ఆడగల వికెట్‌కీపర్ అవసరమని, అలాగే సూర్యకుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మ ఫస్ట్ డౌన్‌లో ఆడే అవకాశం ఉందని Ravichandran Ashwin పేర్కొన్నారు. బుమ్రా, కుల్దీప్ లేకపోవడంతో భారత్ బౌలింగ్ విభాగం పరీక్ష పడే అవకాశం ఉండగా, ఈ సిరీస్ రెండు జట్లకు కూడా కీలక అంచనా వేదికగా మారనుంది.
Read Also: శాలరీ అకౌంట్‌తో వచ్చే ఆఫర్లు తెలుసా?
Follow Us On: X(Twitter)


