కలం వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ(Ravi Teja).. కథ నచ్చితే చాలు.. ఆ డైరెక్టర్ సక్సెస్‌లో ఉన్నాడా? ఫెయిల్యూర్ లో ఉన్నాడా? అనేది ఆలోచించకుండా సినిమా చేయడానికి ఎస్ అంటుంటారు. అలాగే చాలా స్పీడుగా సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ (Shiva Nirvana)తో సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు..? సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు..?
వివేక్ ఆత్రేయ(Vivek Athreya).. విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించి టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. నేచురల్ స్టార్ నాని(Nani)తో సరిపోదా శనివారం(Saripoda Shanivaram) అనే సినిమాని అందించాడు. యాక్షన్ మూవీ అయినప్పటికీ.. ఈ సినిమాని బాగా డీల్ చేశాడు. యాక్షన్ మూవీస్ ని కూడా బాగా డీల్ చేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అనేది అప్ డేట్ లేదు. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikant) తో సినిమా చేసేందుకు కథ రెడీ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కోసం కథ రెడీ చేశాడని, ఇటీవల కథ చెబితే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కొత్త సంవత్సరంలో ఈ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని, శివ నిర్వాణతో రవితేజ చేస్తున్న సినిమా పూర్తైన తర్వాత ఈ మూవీని స్టార్ట్ చేస్తారని సమాచారం. మరి రవితేజను వివేక్ ఆత్రేయ ఎలా చూపిస్తారో.. ఏ జోనర్ లో సినిమా చేస్తారో.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


