Mobile Popup Ad
Mobile Popup Ad

వివాదంలో ఇరుముడి.. మూవీ టీంపై తీవ్ర విమ‌ర్శ‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి (Irumudi). శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ నుంచి భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌కు తోడు ర‌వితేజ కెరీర్‌లో మొద‌టిసారి ఆధ్యాత్మిక పాత్ర‌లో న‌టించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. అయ్య‌ప్ప మాల‌లో ర‌వితేజను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇటీవ‌ల విడుద‌లైన ఇరుముడి క‌ట్టు సాంగ్ ఫుల్ పాపుల‌ర్ అయిపోయింది. శివ నిర్వాణ‌, క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి లిరిక్స్ అందించిన ఈ పాట‌కు జీవీ ప్ర‌కాశ్ మ్యూజిక్ అందించారు. సోష‌ల్ మీడియాలో ఈ పాట మోత మోగిస్తోంది.

దీనికి నెటిజ‌న్లు స్టెప్పులు కూడా వేసేస్తున్నారు. అయితే కొంద‌రు ఇన్‌ఫ్లూయెన్స‌ర్లు అయ్య‌ప్ప స్వామి మాల‌లో ఈ పాట‌కు స్టెప్పులు వేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. కేవ‌లం వీడియో కోసం, ప్ర‌మోష‌న్ల కోసం అయ్యప్ప మాల దుస్తుల‌ను అవ‌మానిస్తారా అని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మూవీ టీం ఇలాంటి ప్ర‌మోష‌న్లు చేయ‌డం త‌గ‌ద‌ని సూచిస్తున్నారు. అయితే మూవీ టీం అధికారికంగా ఈ ప్ర‌మోష‌న్లు చేపిస్తోందా? లేక ఇన్‌ఫ్లూయెన్స‌ర్లు త‌మ ప‌ర్స‌న‌ల్‌గా వీడియోలు చేసుకుంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఇరుముడి టీం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>