కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులకు రంగం సిద్ధమైంది. సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కార్డుల పంపిణీని నేడు (శనివారం) లాంఛనంగా ప్రారంభించనున్నారు. తాజా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 1,06,30,040 రేషన్ కార్డులు (Ration Cards) ఉండగా, వాటి పరిధిలో 3,42,46,181 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద అన్నపూర్ణ అన్నయోజన, ప్రాధాన్యత కుటుంబాల కార్డులతో పాటు రాష్ట్ర కేటగిరీ కార్డులు కూడా ఉన్నాయి. ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలో 56,91,083 కార్డులు, 1,91,65,680 మంది లబ్ధిదారులు ఉండగా.. రాష్ట్ర కేటగిరీలో 49,38,957 కార్డులు, 1,50,80,501 మంది లబ్ధిదారులు ఉన్నారు.
హైదరాబాద్ టాప్.. ములుగు లాస్ట్
జిల్లాల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్ 8,39,524 రేషన్ కార్డులతో మొదటి స్థానంలో ఉంది. కార్డుల సంఖ్యతో పాటు లబ్ధిదారుల (32,08,965 మంది) పరంగానూ హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. రంగారెడ్డి 6,76,528 కార్డులతో రెండో స్థానంలో, మేడ్చల్ మల్కాజిగిరి 6,55,421 కార్డులతో మూడో స్థానంలో ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 1,03,321 రేషన్‌కార్డులు ఉన్నాయి.
జిల్లాల వారీగా రేషన్‌కార్డులు, లబ్ధిదారులు :
జిల్లా మొత్తం కార్డులు మొత్తం యూనిట్లు
ఆదిలాబాద్ 2,27,670 7,45,077
భద్రాద్రి కొత్తగూడెం 3,28,205 9,68,020
హనుమకొండ 2,58,048 7,77,451
హైదరాబాద్ 8,39,524 32,08,965
జగిత్యాల 3,54,336 10,33,286
జనగామ 1,88,606 5,70,619
జయశంకర్భూపాలపల్లి 1,39,564 3,95,877
జోగులాంబ గద్వాల 1,90,845 6,77,364
కామారెడ్డి 2,97,842 10,14,810
కరీంనగర్ 3,22,410 9,58,542
ఖమ్మం 4,73,502 13,36,323
కుమురంభీం ఆసిఫాబాద్ 1,64,823 5,40,596
మహబూబాబాద్ 2,79,178 8,24,932
మహబూబ్‌నగర్ 2,82,056 9,62,850
మంచిర్యాల 2,57,502 7,61,868
మెదక్ 2,42,650 7,92,539
మేడ్చల్ మల్కాజిగిరి 6,55,421 22,52,208
ములుగు 1,03,321 2,94,926

