కలం, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకులకు హాజరైన సీఎం చంద్రబాబు (CM Chandrababu) పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమేనని వ్యాఖ్యానించారు.
దేశం నాకు ఏం చేసిందని కాదని.. దేశానికి తాము ఏం చేయగలమో ఆలోచించాలని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారం చేయాలని .. వందేళ్ల స్వాతంత్య్ర వేడుకల నాటికి సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి దిశగా కొనసాగాలి అని ఆకాంక్షించారు. మరోవైపులో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించారు.
Also Read : స్వాతంత్య్ర వేడుకల్లో కలకలం.. స్పీచ్ మధ్యలో కుప్పకూలిన మంత్రి!
Follow Us On: X(Twitter)

