నేపాల్​ ఎన్నికలు : దూసుకుపోతున్న మాజీ మేయర్​ పార్టీ

కలం, వెబ్​ డెస్క్​: నేపాల్​ సార్వత్రిక ఎన్నికల(Nepal Elections) ఫలితాల్లో కఠ్మాండూ మాజీ మేయర్​, ర్యాపర్​ బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్​ఎస్​పీ) దూసుకుపోతోంది. నేపాల్​ పార్లమెంట్​కు గురువారం ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. 60శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆ దేశ ఎలక్షన్ కమిషన్​ ప్రకటించింది. ఈ క్రమంలో నేడు కౌంటింగ్​ ప్రారంభమైంది. లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆర్​ఎస్​పీ.. మిగిలిన పార్టీలకు అందనంత భారీ సీట్ల తేడాతో పరుగులు తీస్తోంది.

శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయానికి 100కు పైగా సీట్లలో ఆర్​ఎస్​పీ ఆధిక్యంలో ఉంది(Nepal Elections). నేపాలీ కాంగ్రెస్​ ఒక సీట్​ గెల్చుకోగా, మరో 10 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నాయకత్వంలోని సీపీఎన్​(యూఎంఎల్​) పార్టీ కేవలం 7 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. కేపీ శర్మ ఓలి తన స్థానంలో ప్రత్యర్థి కంటే వెనకబడ్డారు. పరిస్థితి చూస్తుంటే బాలేంద్ర షా (Balendra Shah) తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆధునిక భావాలున్న బాలేంద్ర షా .. గతేడాది జెన్​ జీ ఉద్యమాన్ని ముందుండి నడిపించినట్లు చెబుతారు. ఆయనకు యువతలో విపరీతమైన క్రేజ్​ ఉంది. ఆయన్ని వాళ్లు బాలెన్​ షాగా పిలుచుకుంటారు.

కాగా, సోషల్​ మీడియాపై నిషేధంతో గతేడాది సెప్టెంబర్​లో నేపాల్​లో విద్యార్థుల ఉద్యమం చెలరేగింది. వీటిని అణచివేసే ప్రయత్నంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో సుమారు 80 మంది వరకు మరణించారు. అనంతరం ఉద్యమం మరింత తీవ్రమైంది.  దీంతో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి పదవి రాజీనామా చేశారు. అనంతరం తాత్కాలిక ప్రధానిగా మాజీ న్యాయమూర్తి సుశీల కార్కీ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది.

Read Also: యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప‌ర్‌గా అనుజ్ అగ్నిహోత్రి!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>