Mobile Popup Ad
Mobile Popup Ad

యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప‌ర్‌గా అనుజ్ అగ్నిహోత్రి!

క‌లం, వెబ్ డెస్క్‌: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 తుది ఫలితాలను (UPSC Results) కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అనుజ్ అగ్నిహోత్రి (Anuj Agnihotri) జాతీయ స్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించారు. రాజేశ్వరి సువే రెండో ర్యాంక్, అకాన్ష్ మూడో ర్యాంక్ సాధించారు.

గతేడాది ఆగస్టులో నిర్వహించిన రాత పరీక్షలు, 2025 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు జరిగిన ఇంటర్వ్యూల ఆధారంగా మొత్తం 958 మంది అభ్యర్థులను వివిధ విభాగాల్లో ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులను ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇతర సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ A, గ్రూప్ B పోస్టులకు నియమించనున్నారు.

కేటగిరీల వారీగా ఎంపికైన అభ్యర్థులను ప‌రిశీలిస్తే.. జనరల్ కేట‌గిరీలో 317 మంది, ఈడబ్ల్యూఎస్ కేట‌గిరీలో 104 మంది, ఓబీసీ కేట‌గిరీలో 306 మంది, ఎస్సీ కేట‌గిరీలో 158 మంది, ఎస్టీ కేట‌గిరీలో 73 మంది… మొత్తంగా 958 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో వికలాంగుల కోటాలో కూడా కొంతమంది అభ్యర్థులున్నారు. అలాగే నియామకాల కోసం రిజర్వ్ లిస్ట్‌ను కూడా యూపీఎస్సీ సిద్ధం చేసింది. ఈ రిజర్వ్ జాబితాలో మొత్తం 258 మంది అభ్యర్థులున్నారు. ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం వివిధ సేవల్లో మొత్తం 1087 ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఐఏఎస్ పోస్టులు 180, ఐఎఫ్ఎస్‌ పోస్టులు 55, ఐపీఎస్‌ పోస్టులు 150, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ‘A’ పోస్టులు 507, గ్రూప్ ‘B’ సర్వీసెస్ పోస్టులు 195 ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థుల రిజర్వేషన్‌కు సంబంధించిన వివరాలు సంబంధిత అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది. అలాగే 348 మంది అభ్యర్థుల ఎంపిక తాత్కాలికంగా (ప్రొవిజనల్) ఉంచారు. మరో ఇద్దరి ఫలితాలను (UPSC Results) తాత్కాలికంగా నిలిపివేశారు.

టాపర్లు వీరే..
రాజేశ్వరీ సువే, ఆకాంశ్ ధల్, రాఘవ ఝంఝువాలా, ఇషాన్ భాత్ నగర్, జిన్నా అరోరా, పక్షల్, అశ్తా జైన్, ఉజ్వల్ ప్రియాంక్, యశస్వి రాజ్ వర్ధన్ టాప్ ర్యాంకులు సాధించారు.

Read Also: మహాభారతంలో ఆ పాత్రలే నాకు ఆదర్శం: రేవంత్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>