కాజీపేటను రైల్వే జోన్‌గా మార్చాలి: హ‌రీశ్ రావు

కలం, వరంగల్ బ్యూరో: కాజీపేట (Kazipet) కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao), మాజీ ఎమ్మెల్యే వినయ భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. కాజీపేటలో నిర్మిస్తున్నది కోచ్ ఫ్యాక్టరీనా, వ్యాగన్ ఫ్యాక్టరీనా అనే దానిపై స్ప‌ష్ట‌త లేద‌న్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే కేంద్రం వెంటనే గెజెట్ విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని లాథూర్‌కు ఒక న్యాయం చేసి, కాజీపేటకు ఒక న్యాయమా చేస్తారా అని ప్ర‌శ్నించారు. ఇక్కడ నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు వచ్చే బీజేపీ మంత్రుల పర్యటనను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

కాజీపేటను రైల్వే జోన్ గా మార్చాల‌ని దీనిపై బడే భాయ్ ప్రధానిని చోటే భాయ్ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అడగడం లేద‌ని ప్ర‌శ్నించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో బీఆర్ఎస్ దీనిపై పోరాడుతుంద‌ని వెల్ల‌డించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం లాభ‌మ‌ని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విష‌యంలో చొరవ చూపాల‌ని కోరారు. లాథూర్ తరహాలో రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాల‌ని హరీష్ రావు (Harish Rao) కోరారు.

Read Also: లండన్‌లో అగ్నిప్రమాదం.. నిజామాబాద్ యువకుడు మృతి

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>