epaper
Monday, February 23, 2026
epaper

మొన్న నిత్యామీనన్.. నేడు రష్మిక.. అలాంటి పాత్రలో..!

కలం, డెస్క్ : నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) ఈ మధ్య గ్లామర్ పాత్రలు వదిలేసి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. రీసెంట్ గానే లేడీ ఓరియెంటెడ్ మూవీని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఆమె నటిస్తున్న సినిమాల్లో పాత్రలు కూడా నటనకు స్కోప్ ఉండేలా చూసుకుంటోంది. గ్లామర్ పాత్రలతో ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో జర్నీ చేయలేమనే విషయం బహుషా రష్మికకు అర్థమైంది కాబోలు. అందులో భాగంగా ఇప్పుడు సంచలన పాత్రలో నటించేందుకు రెడీ అయినట్టు సమాచారం.

అదే లెస్బియన్ పాత్ర. టాలీవుడ్ భామలు నిత్యా మీనన్, మంచు లక్ష్మీ, ఈషారెబ్బా, రెజీనా కసాండ్రా లాంటి వారు చాలా మంది లెస్బియన్ పాత్రల్లో నటించారు. ఇప్పుడు రష్మిక (Rashmika) కూడా అదే బాటలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్లు ఇలాంటి పాత్రల్లో చేయలేదు. మొదటిసారి రష్మిక ఆ ధైర్యం చేస్తోంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా, రష్మిక, కృతిసనన్ హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ కాక్‌టెయిల్‌ 2.

ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో రష్మిక, కృతిసనన్ లెస్బియన్లుగా కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమాలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుందని అంటున్నారు. మూవీ షూటింగ్ జనవరి 31న కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మూవీ టీమ్ చెబుతోంది. ఒకవేళ నిజంగానే రష్మిక ఇందులో లెస్బియన్ గా నటిస్తే.. మూవీ కచ్చితంగా హిట్ కావాలి అనేలా సిచ్యువేషన్ ఉంటుంది.

ఎందుకంటే రష్మిక అంత డేర్ చేసి లెస్బియన్ పాత్ర చేస్తే.. ఆ స్థాయిలోనే కథ డిమాండ్ ఉండాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరి రష్మిక ఇంత డేర్ చేసినందుకు స్క్రిప్టు ఆ రేంజ్ లోనే ఉంటుందా.. లేదంటే వీక్ కంటెంట్ తో బోల్తా కొడుతుందా అనేది మూవీ రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>