Mobile Popup Ad
Mobile Popup Ad

అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్ఐ మైసయ్య మృతి

కలం, ఖమ్మం బ్యూరో: అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్ఐ మృతి చెందిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం (Khammam) పోలీస్ సాయుధ దళంలో ఎస్ఐ‌గా పని చేసి గత ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయిన కే.మైసయ్య (Maisaiah) కు ఉద్యోగ విరమణ బకాయిలు అందలేదు. దీనికి తోడు ఆరోగ్యం కూడా క్షీణించడంతో బుధవారం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మైసయ్య మృతి చెందారు. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో..  విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం చొరవ తీసుకుని బిల్లు చెల్లించి మృత దేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లారు. మైసయ్య (Maisaiah) కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపు రూ.50 లక్షలు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ అందక పోవడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>