epaper
Monday, February 23, 2026
epaper

బిట్​కాయిన్​ స్కామ్​ కేసులో రాజ్ ​కుంద్రాకు బెయిల్​

కలం, వెబ్​ డెస్క్​: బిట్​కాయిన్​ స్కామ్​ కేసులో బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ ​కుంద్రా(Raj Kundra)కు బెయిల్​ వచ్చింది. ముంబైలోని మనీలాండరింగ్​ నిరోధక చట్టం(పీఎంఎల్​ఏ) కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ రూ.150 కోట్ల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది.

ఏమిటీ బిట్​కాయిన్​ కేసు?

‘వేరియబుల్​ ప్రైవేట్​ లిమిటెడ్​’ అనే సంస్థ 2017లో ‘గెయిన్​ బిట్​కాయిన్​ పోంజీ స్కీమ్​’ను నిర్వహించింది. బిట్​కాయిన్​లపై పెట్టుబడి పెడితే, నెలకు 10శాతం మేర లాభాలు వస్తాయని ఆశ చూపించింది. ఇందులో ప్రజలను చేర్చుకోవడానికి వీలుగా మల్టీ లెవెల్ మార్కెటింగ్​ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీ నగరాల్లో పలువురి నుంచి డబ్బులు కట్టించుకుంది. ఇలా రూ.6వేల కోట్లకుపైగా ఆ సంస్థ వసూలు చేసింది.

అయితే, పెట్టిబడి పెట్టినవాళ్లకు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోగా, అసలు సైతం వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఈ క్రమంలో ఢిల్లీ, ముంబైలో సంస్థపై కేసులు నమోదయ్యాయి. స్కీమ్​ మోసం బయటపడడంతో ఈడీ రంగంలోకి దిగింది. సంస్థ, దాని యజమాని, ప్రమోటర్లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది.

సింగపూర్​ కేంద్రంగా ఉన్న వేరియబుల్​ టెక్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీకి రాజ్​ కుంద్రా (Raj Kundra) యజమాని అని, ఈ స్కామ్​లో ప్రధాన లబ్ధిదారుడు ఆయనే అని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఆయనతోపాటు స్కామ్​లో భాగమున్న అమిత్​ భరద్వాజ్​, వివేక్​ భరద్వాజ్​, సింపీ భరద్వాజ్​కేసు నమోదు చేసింది. అలాగే రాజ్​కుంద్రాకు సంబంధించిన రూ.97.79కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది. ఈ కేసులో విచారణకు రావాలని సమన్లు అందడంతో శుక్రవారం ఆయన కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>