నా కోసం సుప్రియ షూటింగ్ ఆపేసింది: మృణాల్ ఠాకూర్‌

క‌లం, వెబ్ డెస్క్‌: అడివి శేష్ హీరోగా షానియ‌ల్ డియో ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ ‘డెకాయిట్‌’ (Dacoit). ఈ సినిమాలో శేష్ స‌ర‌స‌న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా న‌టించారు. డైరెక్ట‌ర్‌ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్‌ ఏప్రిల్ 10న థియేటర్లలోకి  రానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ టీం ప్ర‌మోష‌న్ల‌లో బిజీబిజీగా ఉంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మీడియా స‌మావేశంలో సినిమా గురించి ఆసక్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఇందులో భాగంగా నిర్మాత సుప్రియ‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. సుప్రియ చాలా నైస్ ప్రొడ్యూసర్ అని, అలాంటి ప్రొడ్యూస‌ర్‌ను ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఒకసారి తాను షూటింగ్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ రావాల్సిన ప‌రిస్థితి ఎదురైంద‌ని, అప్పుడు త‌న‌కు చాలా జ్వరంగా ఉంద‌ని చెప్పారు. త‌న‌ ఆరోగ్యం గురించి తెలుసుకొని సుప్రియ రెండు రోజుల పాటు షూటింగ్‌ను ఆపేశార‌ని వెల్ల‌డించారు. నటీనటుల ఆరోగ్యాన్ని ఇంత జాగ్ర‌త్త‌గా చూసుకునే ప్రొడ్యూసర్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూడలేద‌ని మృణాల్ అన్నారు.

ఇక డెకాయిట్‌లో చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా డిఫికల్ట్ అని, అయితే మేకర్స్ ఆ క్యారెక్టర్‌ను యాక్టర్‌కు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దార‌ని మృణాల్ (Mrunal Thakur) చెప్పుకొచ్చారు. త‌న‌ కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్ రోల్ అని, ఇప్పటి వరకు చేయని కొత్త జానర్ ట్రై చేసిన‌ట్లు చెప్పారు. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాన‌న్నారు. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ త‌న‌ను ఒక తెలుగు అమ్మాయిలాగా అంగీకరించార‌ని, ఆడియెన్స్‌ ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేన‌ని తెలిపారు.శేష్‌కు ఇది బెస్ట్ ఒక ఫిల్మ్‌గా ఉండిపోతుంద‌ని, శేష్, ప్రకాష్ రాజ్‌ల‌తో కలిసి పని చేయడం మంచి అనుభవం అని చెప్పారు.

Read Also: నేనూ డీప్ ఫేక్ బాధితురాలినే : జాన్వీ కపూర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>