సాగునీటి సంఘాలతో సీఎం చంద్రబాబు కీలక టెలికాన్ఫరెన్స్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సాగునీటి సంఘాలతో టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. ‘నీటి భద్రత.. సాగునీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ప్రాంతంలో ‘వాటర్ బడ్జెట్’ (Water Budget), ‘వాటర్ ఆడిట్’ (Water Audit) తప్పనిసరిగా నిర్వహించాలని.. అవి నీటి నిర్వహణలో కీలకమని పేర్కొన్నారు.

కాల్వలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లను మరమ్మతులు చేసి నీటి నిల్వకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, ప్రతి చుక్క నీటిని సంరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు (Chandrababu) అన్నారు. సాగునీటి సంఘాలు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని, రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: బాసరకు కొత్త శోభ.. సర్కారు మాస్టర్ ప్లాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>